Balakrishna Unstoppable నందమూరి బాలకృష్ణ గురించి ఆడియన్స్ లో ఉన్న కొన్ని సందేహాలన్నీ ఆయన చేసిన అన్ స్టాపబుల్ షో ద్వారా క్లియర్ అయ్యాయి. ఎప్పుడు ప్రేక్షకులు బాలయ్య కోపాన్నే చూశారు కానీ ఆయన సెన్సార్ హ్యూమర్, ఆయన కైండ్ నెస్ ఇంకా అసలు ఆయన ఎవరిని ఎలా గౌరవిస్తారు అన్నది ఈ షో ద్వారా తెలిసింది. అందుకే అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆ షో తో పాటు వచ్చిన సినిమాలు ఆ తర్వాత చేసిన ప్రాజెక్ట్ లు సెన్సేషనల్ హిట్ కొడుతున్నాయి. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుంది.
ఇక ఈ షో థర్డ్ సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. ఆహా ఓటీటీలో వస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3 ప్లానింగ్ లో ఉన్నారట ఆహా (Aha) టీం. బాలయ్య డేట్స్ ఇస్తే చాలు షో ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఐతే ప్రస్తుతం బాలకృష్ణ కె ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైతే కానీ ఈ షో చేసే ఛాన్స్ లేదు.
Also Read : Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు భారతరత్న లేదా రాజ్యసభ ఎంపీ
బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 3 కోసం కేవలం నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) మాత్రమే కాదు ఆడియన్స్ కూడా అందరు ఎదురుచూస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ హిట్ కాగా సీజన్ 2 కొన్ని ఎపిసోడ్స్ తోనే ఆపేశారు. ఇక ఇప్పుడు సీజన్ 3ని సిద్ధం చేస్తున్నారట. దానికి సంబందించిన వర్క్ మొదలైందని తెలుస్తుంది.
దసరా నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 3 మొదలు పెట్టే ఛాన్స్ ఉందని టాక్. ఐతే అన్ స్టాపబుల్ లో ఈసారి బాబాయ్ తో అబ్బాయ్ చిట్ చాట్ ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.