Site icon HashtagU Telugu

Trivikram Allu Arjun Movie : కథ కాదు కాన్సెప్ట్.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఏదో పెద్ద ప్లానింగే..!

Trivikram And Allu Arjun

Trivikram And Allu Arjun

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై కొన్నాళ్లుగా మీడియాలో స్పెషల్ డిస్కషన్స్ జరిగాయి. అట్లీ, నెల్సన్ ఇలా ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించగా ఫైనల్ గా మళ్లీ త్రివిక్రం తోనే బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ అందించారు బన్నీ వాసు. అల్లు అర్జున్ త్రివిక్రం (Allu Arjun Trivikram) సినిమా గురించి ప్రస్తావించిన ఆయన అది కథ కాదు కాన్సెప్ట్ అని.. దాన్ని చాలా పెద్ద బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

భారీ బడ్జెట్ అంటే 500 కోట్లతో చేసిన కల్కి (Kalki) కన్నా కూడా ఎక్కువా అని డౌట్స్ మొదలయ్యాయి. బన్నీ వాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అల్లు అరవింద్ (Allu Aravind) గారు ఫైనాన్సర్స్ ని రెడీ చేసుకోవాలని అన్నాడు బన్నీ వాసు. మరి మెగా ప్రొడ్యూసర్ గా పేరున్న అల్లు అరవింద్ కూడా బయట నుంచి తెచ్చేంత సినిమాగా ఇది ఉంటుందని అర్ధమవుతుంది.

ఈ సినిమాకు స్టోరీ కాదు కాన్సెప్ట్ అంటూ బన్నీ వాసు చెప్పడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సో అదే నిజమైతే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ సినిమా ఇది అవుతుందని చెప్పొచ్చు. త్రివిక్రం (Trivikram) లాంటి డైరెక్టర్ కొత్తగా అది కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చెప్పబోతున్నాడు అంటే దాని రేంజ్ వేరేలా ఉంటుంది.

మరి ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటి.. ఎంత బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ కే ఏడాదిన్నర దాకా అవుతుందన్న బన్నీ వాసు సినిమా గురించి మిగతా డీటైల్స్ ఎప్పుడు చెబుతారన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బన్నీ వాసు ఇచ్చిన అప్డేట్ తో అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

Also Read : Megastar Viswambhara : విశ్వంభర టీజర్ ఎప్పుడు.. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్..!