Allu Arjun 22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 22 ఏళ్ల సినీ జర్నీపై ఓ లుక్

ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల్లో అల్లు అర్జున్(Allu Arjun 22) మెరిశారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun 22 Years Gangotri To Pushpa Movies Career graph

Allu Arjun 22 : అల్లు అర్జున్ ఇంత పెద్ద స్టార్‌గా ఎదుగుతారని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. తన నటనా చాతుర్యంతో అందరి అంచనాలను బన్నీ తలకిందులు చేశారు. తన సత్తా ఏమిటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. ట్యాలెంట్, బలమైన ఆకాంక్ష ఉంటే చాలు.. ఎవరైనా సినిమాల్లో రాణించగలరు అని అల్లు అర్జున్ నిరూపించారు. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన నటించిన ‘గంగోత్రి’ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 22 ఏళ్లు. నాటి నుంచి నేటివరకు సినీ ఇండస్ట్రీలో బన్నీ/పుష్పరాజ్ అంచెలంచెలుగా ఎలా ఎదిగారో ఓ లుక్కేద్దాం..

Also Read :Seethakka Husband : మంత్రి సీతక్క భర్త గురించి ఈ విషయాలు తెలుసా..

అల్లు అర్జున్ 22 ఏళ్ల కెరీర్ విశేషాలివీ.. 

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన  డాడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో అల్లు అర్జున్ తొలిసారి నటించారు.
  • గంగోత్రి మూవీలో తొలిసారిగా హీరోగా బన్నీ నటించారు.  అది రాఘవేంద్ర రావు 100వ సినిమా.
  • సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ మూవీతో అల్లు అర్జున్‌కు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.  అందుకే నేటికీ డైరెక్టర్ సుకుమార్‌ను అల్లు అర్జున్ ఎంతో అభిమానిస్తుంటారు. సుకుమార్ వల్లే తాను ఇంతటి స్థాయికి ఎదిగానని బహిరంగంగా చెబుతుంటారు.
  • ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల్లో అల్లు అర్జున్(Allu Arjun 22) మెరిశారు.
  • ‘వేదం’, గోన గన్నారెడ్డి, ‘దేశ ముదురు’లలో తన నటనతో అందరినీ బన్నీ ఆకట్టుకున్నారు.
  • డీజే దువ్వాడ జగన్నాథం, బద్రీనాథ్‌ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారు.
  • ఇద్దరమ్మాయిలతో, నా పేరు సూర్య, రేసు గుర్రం, సరైనోడు వంటి సినిమాలతో  బన్నీ మెప్పించారు.
  • జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను బన్నీ గెల్చుకున్నారు.
  • ఆర్య మూవీతో అల్లు అర్జున్ కెరీర్‌ను టర్న్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌.. పుష్ప మూవీతో పుష్ప రాజ్‌గా ఓ చరిత్రను తిరగరాసే పాత్రను క్రియేట్ చేశారు.  దీంతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌ అభిమానులను సంపాదించుకున్నారు.
  • పుష్ప-2 మూవీ భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.
  • ఇప్పుడు అల్లు అర్జున్ డేట్స్‌ కోసం బాలీవుడ్‌లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు వెయిట్‌ చేస్తున్నారు.
  Last Updated: 29 Mar 2025, 08:57 AM IST