Varalaxmi Sarathkumar: మెగాస్టార్ అభినందించడం నిజంగా గొప్ప ఆనందాన్నిచ్చింది: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అనగానే చాలామందికి హీరోయిన్ ట్యాగ్ గుర్తుకురాకుండా వైవిధ్యమైన నటిగానే మదిలో మెదులుతుంది. ఏ పాత్ర చేసినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది. హీరోలతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. తాజాగా ఈ నటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘హను-మాన్’ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకేం కావాలో (ప్రశాంత వర్మ) పూర్తి క్లారిటీ తనలో వుంటుంది. తేజ, ప్రశాంత్ మధ్య మంచి సింక్ వుంది. […]

Published By: HashtagU Telugu Desk
Varalaxmi Sarath Kumar Troubled in Movie Shoot While a Scene

Varalaxmi Sarath Kumar Troubled in Movie Shoot While a Scene

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అనగానే చాలామందికి హీరోయిన్ ట్యాగ్ గుర్తుకురాకుండా వైవిధ్యమైన నటిగానే మదిలో మెదులుతుంది. ఏ పాత్ర చేసినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది. హీరోలతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. తాజాగా ఈ నటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘హను-మాన్’ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తనకేం కావాలో (ప్రశాంత వర్మ) పూర్తి క్లారిటీ తనలో వుంటుంది. తేజ, ప్రశాంత్ మధ్య మంచి సింక్ వుంది. పైగా ప్రశాంత్ ఒక్క టేక్ లో ఓకే చెప్పే డైరెక్టర్ కాదు (నవ్వుతూ) తను అనుకున్నది వచ్చే వరకూ రాజీపడరు. అయితే ఏదైనా బెటర్ మెంట్ కి ఉపయోగపడుతుందంటే ఇన్ పుట్ తీసుకుంటారు. ప్రశాంత్ వర్మ గారు ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. తప్పకుండా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఇందులో తేజకి అక్క పాత్రలో కనిపిస్తాను. బ్రదర్, సిస్టర్ మధ్య వుండే సరదా సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి.

ఇది సూపర్ హీరో ఫిల్మ్. ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. అది ట్రైలర్ లో చూసే వుంటారు. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంత అద్భుతంగా సినిమా తీశారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ చిత్రం ఇంత పెద్ద స్కేల్ లో గ్రాండ్ గా రావడం చాలా ఆనందంగా వుంది.

ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది. తేజ, ప్రశాంత్, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇక చిరంజీవి గారు నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డ్ లా అనిపించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను. నేను ప్లాన్ చేయడం ఆపేశాను. నేను ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగలేదు. జీవితంలో జరగాల్సింది జరిగిపోతుంది. నేను ఎప్పుడూ భాష గురించి అలోచించలేదు.

Also Read: Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం

  Last Updated: 11 Jan 2024, 03:17 PM IST