Site icon HashtagU Telugu

Tollywood: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. ఉదయం నుంచి తనిఖీలు..!

Tollywood

It Raids

హైదరాబాద్‌లోని టాలీవుడ్ (Tollywood) ప్రముఖుల నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్, నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులపై ఐటీ, ఈడీ ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నట్టగా తెలుస్తోంది.

Also Read: Mrunal Thakur : అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన మృణాల్ ఠాకూర్

ప్రముఖ డైరెక్టర్ నివాసంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.