IT Raids : ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు

Published By: HashtagU Telugu Desk
IT Raids on Ravi Teja's Tiger Nageswara Rao producer

IT Raids on Ravi Teja's Tiger Nageswara Rao producer

గత కొద్దీ నెలలుగా ఐటీ రైడ్స్ (IT Raids) అనేవి కలకలం రేపుతున్నాయి. రాజకీయ నేతలతో పాటు బిజినెస్ నేతలు , సినీ ప్రముఖుల ఇళ్లలో , ఆఫీస్ లలో ఐటీ రైడ్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా నేడు ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాత అభిషేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. వంశీ (Vamsee) డైరెక్షన్లో టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాను అభిషేక్ నిర్మించారు.

We’re now on WhatsApp. Click to Join.

1970 కాలంలో స్టూవర్ట్‌పురం (stuartpuram )లో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు (Tiger nageswara rao) జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్ (Anupam Kher) ‌, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నాడు. మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 19 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు.

ఈ సమయంలో చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Producer Abhishek Agarwal) ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉన్న నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత మాత్రమే కాదు వ్యాపార వేత్త కూడా. ఈ క్రమంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Read Also : Galaxy Buds 2 Pro: అమెజాన్‌లో 2,899 రూపాయలకే గెలాక్సీ బడ్స్ 2 ప్రో..?

  Last Updated: 11 Oct 2023, 03:18 PM IST