టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీ లో పెద్ద హీరో (TOp Hero) ఎవరు అంటే..ఎవరికీ వారు తమ అభిమాన హీరోనే పెద్ద హీరో అని చెపుతుంటారు. సోషల్ మీడియా లో కూడా ఇదే విషయమై వార్ కొనసాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం పెద్ద హీరో ఎవరు అని అడిగితే ఎవ్వరు కరెక్ట్ గా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు అగ్ర హీరో స్థాయి అనేది బాక్స్ ఆఫీస్ వసూళ్ల పై ఆధారపడి ఉంది వరుస పెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తూ..బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు పెంచుకుంటూ వెళ్తే తప్ప పెద్ద హీరో అని ఫిక్స్ కాలేని పరిస్థితి. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవి సినిమాలు వసూళ్ల ప్రభంజనం సృష్టించేవి.. దీంతో ఆయన్ను పెద్ద హీరో అంటూ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆలా లేదు. చిన్న హీరోలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నారు. అలాగే పెద్ద హీరోలు ప్రభాస్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా పలువురు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఒకర్ని మించి ఒకరు అత్యధిక వసూళ్లు సాధిస్తున్నారు. కాకపోతే కంటిన్యూ అనేది చేయలేకపోతున్నారు. దీంతో ఎవరు పెద్ద హీరో అనేది చెప్పడం కష్టంగా మారింది.
ఇదే విషయాన్నీ నిర్మాత సురేష్ బాబు (SUresh babu) చెప్పుకొచ్చారు. ఓ ఇంగ్లీష్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఎవరు బిగ్గెస్ట్ స్టార్ అనే విషయంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. టాప్ స్టార్లలో ప్రతి హీరోకూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కలెక్షన్లు దర్శకుడి మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవచ్చు. అందుకే కలెక్షన్ల ఆధారంగా ఎవరు పెద్ద హీరో అనేది నిర్ణయించలేం.
తెలుగులో పవన్ కళ్యాణ్‌కు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ప్రభాస్ సినిమాలకు కూడా ఇప్పుడు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా ఇలాగే మంచి స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ దేశంలోనే పెద్ద హీరోనా అంటే చెప్పలేం. బాహుబలి, సలార్ మధ్యలో ఆయన నటించిన పలు సినిమాలు అంచనాలను అందుకోలేదు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్‌కు అత్యధిక ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న దర్శకులతో సినిమా తీసినా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలా అని ఏ సినిమా తీసినా చూస్తారని అనుకోకూడదు. ఎందుకంటే గతంలో ఆయన్నుంచి వచ్చిన ‘జానీ’ పూర్తిగా ఫెయిలైంది. తెలుగులో వంద కోట్ల వసూళ్లు సాధించే హీరోలు చాలా మంది ఉన్నారు ” సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు పెద్ద హీరో అనేది చెప్పడం కష్టం అని పేర్కొన్నారు.
Read Also : Parenting Tips : ఈ చిట్కాలు మీకు తెలిస్తే, పిల్లల కోపాన్ని ఎదుర్కోవడం సులభం..!