Site icon HashtagU Telugu

Devil : ‘డెవిల్’ కమర్షియల్ అంటున్న కళ్యాణ్ రామ్.. ఇంకా ఏమేం చెప్పారంటే..

Devil

Devil

Devil : డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. దీని ట్యాగ్ లైన్ ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ . అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా(Devil)  గురించి పలు విషయాలను మీడియాతో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్  మాట్లాడుతూ.. ‘‘2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను చెప్పారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమా డెవిల్. కథ వినగానే నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేశారా? అని నేను అడిగాను. అప్పుడాయన మాట్లాడుతూ నేను దీన్ని కథగానే చేశాను. అభిషేక్‌ నామాగారు మీకు నెరేట్ చేయమంటే కమర్షియల్ హీరో కదా, ఆయన ఒప్పుకుంటారా అని అన్నారు. అప్పుడు నేను శ్రీకాంత్‌కి రెండు విషయాలు చెప్పాను. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ అలాగే ఉండనిచ్చి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే సినిమా చేద్దామని అన్నాను. అప్పటికే బింబిసార సినిమా సగం పైగానే పూర్తయ్యింది. మనం ఎలాంటి సినిమా చేస్తున్నాం. ఎలా వస్తుందనేది అప్పటికే ఓ ఆలోచనకు వస్తుంది. కాబట్టి శ్రీకాంత్‌కి స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించాను. దాంతో శ్రీకాంత్ రెండు, మూడు నెలలు కూర్చుని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేశాం. దీనికి ఏడాది సమయం పట్టింది. మేకింగ్ కోసం ఏడాది సమయం పట్టింది’’ అని చెప్పారు.

Also Read: Eagle X Dhamaka : ఈగల్‌లో కొత్త రవితేజను చూస్తారు : మాస్ మహారాజా

‘‘ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతుంటాను. ఉదాహరణకు ఎమిగోస్ సినిమా విషయానికి వస్తే అందులో డాపల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది. దాన్ని చెప్పే క్రమంలో ఎక్కడో ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆరోజు రాలేదు. డైరెక్టర్ తో కూర్చుని మాట్లాడి ఆ పని చేసుండాల్సి. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్ ఫైర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉండటం నాకు కొత్తగా అనిపించింది. ఇది పక్కా ఫిక్షనల్ మూవీ’’ అని హీరో నందమూరి కళ్యాణ్ రామ్  తెలిపారు.

నా క్యారెక్టర్‌కు భారతీయత

‘‘సౌందర్ రాజన్‌గారు సినిమాటోగ్రాఫర్ అనగానే నేను కథ వినేటప్పుడు ఎలా ఉంటుందని అంచనా వేసుకున్నానో దాన్ని మించేలానే విజువల్స్ ఉంటుందని నిర్ణయించుకున్నాను. అలాగే రాజేష్ తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. డెవిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినప్పుడు.. హీరో లుక్ ఎలా ఉండాలని అనుకున్నప్పుడు రాజేష్ రెఫరెన్స్ తీసుకొచ్చి చూపించారు. అది చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారు’’ అని హీరో నందమూరి కళ్యాణ్ రామ్  పేర్కొన్నారు.

కళ్యాణ్ రామ్ ఇంకా ఏమన్నారంటే..