Nidhi Agarwal : ఇస్మార్ట్ బ్యూటీకి రెబల్ స్టార్ ఛాన్స్.. వర్క్ అవుట్ అయితే మాత్రం దశ తిరిగినట్టే..!

Nidhi Agarwal పూరీ జగన్నాథ్ రాం కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఆ సినిమా కన్నా ముందు రెండు సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు.

Published By: HashtagU Telugu Desk
Ismart Beauty Nidhi Agarwal Prabhas Raja Saab Chance

Ismart Beauty Nidhi Agarwal Prabhas Raja Saab Chance

Nidhi Agarwal పూరీ జగన్నాథ్ రాం కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ఆ సినిమా కన్నా ముందు రెండు సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. కానీ అమ్మడు ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ను వాడుకోలేకపోయింది అమ్మడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత కోలీవుడ్ లో కూడా బిజీ అయిన నిధి అక్కడ ఎక్కువ ఫోకస్ చేసింది.

తెలుగులో పెద్దగా సినిమాలు చేయని నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లులో మాత్రం ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా దాదాపు నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంటూ వస్తుంది. ఇక లేటెస్ట్ గా నిధి అగర్వాల్ కు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఇంపార్టెంట్ రోల్ లో నిధి అగర్వాల్ నటిస్తుందట. మారుతి, ప్రభాస్ అసలేమాత్రం ఊహించని ఈ కాంబో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేస్తూ అటు క్లాస్ ఇటు మాస్ అందరినీ ఆకట్టుకునేలా మారుతి సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా ఉంటుందని తెలిసి ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన క్రేజ్ ని వాడుకోలేని నిధి రాజా సాబ్ తర్వాత అయినా దశ తిరిగేలా చేసుకుంటుందో లేదో చూడాలి.

Also Read : Vishal Vs Udhayanidhi Stalin : తమిళనాడు థియేటర్స్‌ని ఉదయనిధి స్టాలిన్ కంట్రోల్ చేస్తున్నాడా? విశాల్ కామెంట్స్ వైరల్..

  Last Updated: 16 Apr 2024, 04:56 PM IST