Zainab Ravdjee : ‘అక్కినేని’ వారింట వరుసగా పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. డిసెంబరు 6న శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగనుంది. ఇక హీరో నాగార్జున మరో కుమారుడు అఖిల్‌కు జైనబ్ రావడ్జీతో నిశ్చితార్ధం గ్రాండ్‌గా జరిగింది. వీరిద్దరి పెళ్లి వచ్చే సంవత్సరం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక జైనబ్ రావడ్జీ(Zainab Ravdjee) గురించి అంతటా చర్చ జరుగుతోంది. నాగార్జున కోడలు కాబోతున్న జైనబ్ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. వివరాలివీ..
Also Read :OTP Disruption : డిసెంబరు 1 నుంచి కొన్ని ఓటీపీలు లేట్.. ఇంకొన్ని ఓటీపీలు రావు
జైనబ్ గురించి..
- జైనబ్ రావడ్జీ హైదరాబాద్‌లోనే పుట్టారు. ఇక్కడే పెరిగారు.
- ఆమె కుటుంబం ప్రస్తుతం ముంబైలో ఉంది.
- జైనబ్ రావడ్జీ వయసు 39 ఏళ్లు కొన్ని మీడియాలలో.. 27 ఏళ్లు ఇంకొన్ని మీడియాలలో కథనాలు వస్తున్నాయి. అందుకే ఆమె వయసుపై ఇప్పుడే సరైన నిర్ధారణకు రావడం కుదరడం లేదు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని వయసు 30 ఏళ్లు.
- అఖిల్, జైనబ్‌లు ఒకసారి హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పరిచయమయ్యారు.
- జైనబ్‌ది హిందూమతం కాదు.
- జైనబ్ ఒక పెయింటర్, థియేటర్ ఆర్టిస్టు. హైదరాబాద్‌తో పాటు దుబాయ్, లండన్ లాంటి పెద్ద నగరాల్లో తన ఆర్ట్‌లతో ఆమె ఎగ్జిబిషన్లను నిర్వహించింది.
- జైనబ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిని ప్రైవేట్‌లో పెట్టింది. ఆమె సెలబ్రిటీ లైఫ్‌కి చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.
- జైనబ్ స్కిన్ కేర్‌పై ఒక బ్లాగ్ నిర్వహిస్తుంటారు.
- ఎంఎఫ్ హుస్సేన్ సినిమా ‘మీనాక్షి : ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ ఇన్ 2004’లో జైనబ్ ఒక చిన్న పాత్రను పోషించారు. ఆ మూవీలో టాబూ, కునాల్ కపూర్ కూడా నటించారు.
- జైనబ్ తండ్రి జుల్ఫీ రావడ్జీ రియల్ ఎస్టేట్ టైకూన్. ఆయన నిర్మాణ రంగంలో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
- ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా జుల్ఫీ పనిచేశారు.
- అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా జుల్ఫీ వ్యవహరించారు.
- జుల్ఫీ రావడ్జీ కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తే. ఆయన ZR Renewable Energy Pvt Ltd సంస్థకు చైర్మన్ అండ్ ఎండీ.