Vijay Leo : మున్నా కథనే మళ్ళీ తీస్తున్నారా.. విజయ్ లియోపై వెరైటీ టాక్..!

Vijay Leo కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్ అంతే సూపర్ ఫాం లో ఉన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్

Published By: HashtagU Telugu Desk
KeralaBoycottLeo

Is Vijay Leo Inspired With

Vijay Leo కోలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్ అంతే సూపర్ ఫాం లో ఉన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా లియో. ఆల్రెడీ మాస్టర్ అంటూ ఈ కాంబోలో వచ్చిన సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరు మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. లియో ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచుకుంటుంది. అయితే లియో నుంచి లేటెస్ట్ గా రిలీజైన ఒక పోస్టర్ సినిమాపై ఊహించని చర్చకు దారి తీసింది.

అదేంటి అంటే రీసెంట్ పోస్టర్ లో విజయ్ సంజయ్ దత్ మీద ఫైట్ చేస్తున్న పోస్టర్ వదిలారు. అది చూసిన కొందరు విజయ్ సంజయ్ దత్ లు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని తండ్రి మీద పగ తీర్చుకునే కొడుకు కథగానే లియో వస్తుందని హడావిడి చేయడం మొదలు పెట్టారు. ఇక కొందరైతే కథ అదే అయితే ప్రభాస్ ఆల్రెడీ మున్నా చేశాడుగా అని కూడా చర్చిస్తున్నారు. ప్రభాస్ మున్నా సినిమా కూడా తండ్రి మీద కోపం తో అతని మీద పగ సాధించాలనుకునే కొడుకు కథతో వచ్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి గా ప్రకాష్ రాజ్ నటించాడు. విజయ్ లియో సినిమాలో సంజయ్ దత్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. విజయ్ బ్రదర్ పాత్రలో అతను కనిపిస్తాడని టాక్. పోస్టర్ చూసి సినిమా కథ అదే అని డిసైడ్ చేయడం కష్టం ఒకవేళ అదే నిజమైతే మాత్రం కచ్చితంగా లియోకి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి దెబ్బ పడే ఛాన్స్ ఉంది.

విక్రం తర్వాత లోకేష్ తీసే ప్రతి సినిమా మీద అంచనాలు పెరిగాయి. విజయ్ లియో (Vijay Leo )ని కూడా నెక్స్ట్ లెవెల్ లో తీసుంటాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ ఈ సినిమా కథ మున్నా కథకు దగ్గరగా ఉంటుందన్న వార్తలు దళపతి ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న లియో సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్.

Also Read : Samsung Galaxy S23 FE 5G శాంసంగ్ నుంచి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ.. ఫీచర్స్ చూసేయండి..!

  Last Updated: 23 Sep 2023, 10:15 AM IST