Site icon HashtagU Telugu

Vijay Devarakonda Pushpa 3 : పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఉన్నాడా..?

Is Vijay Devarakonda screening in Pushpa 3

Is Vijay Devarakonda screening in Pushpa 3

సెన్సేషనల్ హిట్ అయిన పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతుంది. పుష్ప 2 సినిమాకు వస్తున్న కలెక్షన్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉన్నాయి. ఈ మాస్ యుపోరియాని మేకర్స్ కూడా ఊహించలేనంతగా ఉంది. సుకుమార్, అల్లు అర్జున్ మూడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ఐతే పుష్ప 2 మాత్రమే కాదు పుష్ప 3 కూడా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ఎండింగ్ లో ట్విస్ట్ ఇచ్చాడు. పుష్ప 3 (Pushpa 3) ర్యాంపేజ్ అంటూ పోస్టర్ వదిలారు.

ఐతే పుష్ప 2 చివర్లో ఓ పక్క పుష్ప రాజ్ తన అన్న కూతురు పెళ్లికి ఆహ్వానం అందుకుంటాడు. ఆ పెళ్లికి అమ్మ, భార్య శ్రీవల్లితో పెళ్లికి వెళ్తాడు. కట్ చేస్తే అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఐతే ఆ బ్లాస్ట్ చేసిన వ్యక్తి బ్యాక్ నుంచి మాత్రమే కనిపిస్తాడు. అతను ఎవరు అన్నది చూపించలేదు. ఆ వ్యక్తి ఎవరన్నది సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

విలన్ గా విజయ్..

అది ఫాహద్ ఫాజిల్ అని కొందరు అంటుంటే కాదు రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అని మరికొందరు అంటున్నారు. పుష్ప 3 లో విజయ్ దేవరకొండ ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప 3 లో విలన్ గా విజయ్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజం ఏంటన్నది చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంటుంది. ఐతే పుష్ప 1 వెంటనే పుష్ప 2 పనుల్లో ఉన్న సుకుమార్ అల్లు అర్జున్ ( Allu Arjun). పుష్ప 3 కి కొంత గ్యాప్ తీసుకుని వేరే సినిమాలు చేశాకే పార్ట్ 3 చేయాలని అనుకుంటున్నారట.

పుష్ప 3 ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం 2030లోనే వస్తుందని అంటున్నారు. అంటే సినిమా కోసం 6 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే అన్నమాట.