Site icon HashtagU Telugu

RGV : వర్మ కోయంబత్తూరులో ఉన్నాడా..?

Varma Mohanlal

Varma Mohanlal

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ను అదుపులోకి తీసుకోవాలని ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి చేరుకుంటే..ఆయన మాత్రం కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా వర్మ.. హీరో మోహన్ లాల్ తో కలిసిన ఫొటో ‘X’లో పోస్ట్ చేయడంతో ఆయన షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ..పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. నిత్యం వివాదాలతో కేరాఫ్ వార్తల్లో నిలుస్తుంటారు. తనకు తానే గొప్ప అని , తన ముందు అంత తక్కువే అని మెంటాల్టీ ఉన్న వ్యక్తి. ఒక్కప్పుడు చిత్రసీమలో వర్మ అంటే ఈ గౌరవమే వేరే లెవల్లో ఉండే..కానీ ఇప్పుడు వర్మ అంటే వాడో వెదవ అనే పేరు తెచ్చుకున్నాడు. అవసరం లేని చోట తగువు పెట్టుకొని ఇప్పుడు అందరికి దూరం అయ్యాడు. చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లో కూడా వేలుపెట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యేందుకు సిద్దమయ్యాడు.

గత వైసీపీ , జగన్ అండ చూసుకొని చంద్రబాబు , పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో తెలియంది కాదు. జగన్ చెప్పిందల్లా చేసుకుంటూపోయి..ఇప్పుడు వరుస కేసులతో బిక్కుబిక్కుమంటున్నాడు. గత ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా విడుదల సమయంలో రాంగోపాల్ వర్మ చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి అనుచిత పోస్టులు పెట్టారు. చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణిలతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆయన చేసిన అనుచిత పోస్టులకు సంబంధించి రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీంతో పోలీసుల విచారణకు నాలుగు రోజుల సమయం కోరాడు వర్మ. తను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసాడు. ఆ తర్వాత కూడా విచారణ కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో ఈరోజు పోలీసులు హైదరాబాద్ లోని ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఇంటికి చేరుకున్నారు. కానీ వర్మ ఇంట్లో లేకపోవడం తో పోలీసులు వెనుతిరిగారు. మరి వర్మ ను ఎప్పుడు అదుపులో తీసుకుంటారనేది చూడాలి.

Read Also :