రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా ఎంతగానో ఉన్న అంచనాలు, తాజాగా ‘వారణాసి’ సినిమా గురించి బయటకు వస్తున్న చర్చలతో మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా Letterboxd లో వైరల్ అవుతున్న ఒక అనధికారిక వార్త సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. “వారణాసిని ఒక భారీ గ్రహశకలం ఢీకొన్నప్పుడు జరిగే విపరీత పరిణామాలు, ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుందా? దాన్ని ఆపడానికి కాలమానాలు, ఖండాలు దాటి ప్రయాణించే ఒక రక్షకుడు అవసరమా?” అనే ఈ కథన వివరణ, రాజమౌళి తీసే సినిమా స్కేలు ఎలా ఉంటుందో ఊహించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇటువంటి హై కాన్సెప్ట్ కథను భారతీయ పౌరాణికత, సాహసికత, విజువల్ గ్రాండ్‌నెస్‌తో కలిపి చూపించడంలో రాజమౌళి ప్రత్యేక నైపుణ్యం కలిగిన దర్శకుడు కావడంతో ఆసక్తి మరింత రెట్టింపు అయింది.
Another Bus Accident : యాసిడ్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
ఈ కథనం నిజమైతే ‘వారణాసి’ ఒక టైమ్ ట్రావెల్ – మిథాలజీ – అపోకలిప్స్ మిళితమైన మహా సాహస చిత్రంగా మారే అవకాశముంది. గ్రహశకలం కుదిపేయబోయే ప్రపంచాన్ని ఆపేందుకు హీరో కాలాన్ని చీల్చుకుంటూ విభిన్న యుగాలకు వెళ్తాడు అనే కాన్సెప్ట్ భారతీయ సినిమాల్లో అరుదుగా కనిపించే ప్రయత్నం. మహేశ్ బాబును రెండు విభిన్న కాలాల్లో రెండు షేడ్స్‌తో చూపించనున్నారనే చర్చ కూడా సినిమాపై మరింత మిస్టరీని రేకెత్తిస్తోంది. ఒకవైపు భారతీయ చరిత్రలోని ప్రాచీన జ్ఞానం, మరోవైపు భవిష్యత్ సాంకేతికత ఇవి రెండూ కలిసిపోయే కాన్సెప్ట్‌ను రాజమౌళి ఎలా కథగా మలుస్తారు? ఆయన తీసే ప్రపంచస్థాయి విజువల్ ప్రదర్శనలో వారణాసి ఘాట్‌లు, శైవపరంపర, కోస్మిక్ ఎనర్జీ లాంటి అంశాలు ఎలా అద్భుత దృశ్యాలుగా మలుస్తారనే కుతూహలం పెరుగుతోంది.
రాజమౌళి సినిమాల్లో కథ కేవలం కథగా కాకుండా ఒక విస్తృత ప్రపంచంగా (Universe) మారడం సర్వసాధారణం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు కథను ఎలా మహోన్నత స్థాయికి తీసుకెళ్లారో చూస్తే, ‘వారణాసి’లో కూడా అంచనాలకు మించి కొత్త సినీ అనుభవం ఇవ్వడం ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు. మానవజాతి నిలవడానికి ఒకే ఒక్క రక్షకుడు కాలంప్రవాహంలో చేసే పోరాటం, విధి-భవితవ్యాల మధ్య జరిగే సంఘర్షణ, ఆ ప్రయాణంలో పాత భారతీయ శాస్త్రాలు ఇచ్చే సూచనలు ఇవి అన్నీ కలిసినప్పుడు ఈ సినిమా భారతీయ సినిమాలో ఓ నూతన అధ్యాయం రాయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక కథానిక వచ్చేవరకు ఇది ఊహాగానమే అయినా, ఈ ఊహాగానమే సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద సెన్సేషన్‌గా మార్చింది.
