Kalki: కల్కి మూవీకి.. పురణాలకు ఏమైనా లింక్ ఉందా?

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 10:12 PM IST

Kalki: మొదటి షో నుంచే కల్కి.. బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు టాక్‌ తెచ్చుకుని.. సరికొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే దిశగా పరుగులు తీస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది. కల్కి ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో కల్కి పక్కన ఉన్న 2898 ఏడీ అనే నంబర్‌కు అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు నెటిజనులు. మరి 2898 నంబర్‌ ఏంటి.. దీనికి కల్కికి ఉన్న సంబంధం ఏంటి అంటే..

హిందూ పురాణాల ప్రకారం.. కలియుగం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇక కలియుగంలో ధర్మం తప్పి.. అధర్మం పాలన సాగిస్తున్న వేళ.. ఏ నిమిషయంలో అయినా సరే.. శ్రీమహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి వచ్చి.. ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో వర్ణించారు. ఇక పురాణాల ప్రకారం కలియుగం 4 లక్షలకు పైగా సంవత్సరాలు ఉంటే.. ఇప్పుడు వచ్చిన కల్కి చిత్రంలో దర్శకుడు ఎందుకు 2898 అనే సంవత్సరాన్ని ఎంచుకున్నాడు.. అందుకు గల కారణం ఏంటి అంటే.. పురాణాలు, వ్యాస భారతం ప్రకారం చూసుకుంటే కలియుగం ప్రారంభం అయ్యి ఇప్పటికి 5126 సంవత్సరాలు. 5 వేల ఏళ్ల ముందు భారత చరిత్రలో కురుక్షేత్రం, ద్వాపరయుగం ముగింపు, కలియుగం ఆరంభం జరిగింది. వ్యాసమహాభారతం, పురణాల ప్రకారం మహా భారత యుద్ధం జరిగింది.

అయితే యుద్ధంలో కౌరవులు మరణించి.. పాండవులు విజయం సాధించారు. యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉపపాండవులును అశ్వత్థామ నిర్ధాక్షిణ్యంగా సంహరించాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి అని తెలిసి కూడా.. బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో.. ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా మరణిస్తాడు. దాంతో ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3 వేల ఏళ్ల పాటు దుర్గందంతో తిరుగుతూ ఉంటావని ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శాపం, వరం ఇచ్చాడు.

ఇదే సమయంలో యుద్ధంలో దుర్యోదనుడు మరణించడంతో.. తీవ్ర ఆవేదనకు గురైన అతడి తల్లి గాంధారి.. శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. ఆయన తల్చుకుంటే యుద్ధం జరిగేది కాదని.. అయినా శ్రీకృష్ణుడు ఆ పని చేయలేదని.. అందువల్ల తన 100 మంది కుమారులు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతటితో ఆగక యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి వంశం నాశనం అవుతుందని శపిస్తుంది. అంటే గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తర్వాత.. అనగా 3102 బీసీఈలో కృష్ణావతారం ముగిసి.. కలియుగం ప్రారంభం అవుతుందని వ్యాస భారతంలో చెప్పారు.