Site icon HashtagU Telugu

Mega Project : మెగా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా..?

Is That Mega Project Cancel

Is That Mega Project Cancel

మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా బింబిసారా ఫేమ్ వశిష్ట డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత తనయురాలు సుస్మిత నిర్మాణంలో మరో సినిమా కూడా లైన్ లో పెట్టాడు చిరు. మెగా 156 మూవీగా రాబోతున్న ఈ Mega Project సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తారని అనౌన్స్ చేశారు. భోళా శంకర్ రిజల్ట్ తర్వాత చిరు తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో కళ్యాణ్ కృష్ణ సినిమాని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

సినిమా కథ కుదరలేదా లేదా మరో కారణం కానీ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చిరు మూవీ ప్రస్తుతానికి ఆగిపోయినట్టు తెలుస్తుంది. అంతా ఓకే అనుకొని ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆగిపోవడం పట్ల మెగా డాటర్ సుస్మిత కొంచెం అప్సెట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాకు కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఖర్చు పెట్టారట. కూతురు ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చి ఈ ప్రాజెక్టుని ఆపేయాలని చిరు (Chiranjeevi) నిర్ణయించుకున్నట్టు టాక్.

నాగార్జున కు సోగ్గాడే చిన్నినాయన, నాగచైతన్యకు రారండోయ్ వేడుక చూద్దాం హిట్లు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ నాగార్జున నాగ చైతన్య కలిసి చేసిన బంగార్రాజు సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా తను చేసిన రవితేజ నేల టికెట్ సినిమాతో మాత్రమే ఫెయిల్ అయ్యాడు కళ్యాణ్ కృష్ణ. ఇంతకీ చిరు ఈ సడన్ డెసిషన్ వెనక కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. వశిష్ట సినిమా షూటింగ్ టైం ఎక్కువ పట్టేలా ఉంది కాబట్టి ఈ లోగా మరో సినిమా చేయాలని చిరు అనుకుంటున్నారు.

కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna) సినిమా పూర్తిగా ఆపేశారా లేదా హోల్డ్ లో పెట్టారా అన్నది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మెగా ఫ్యాన్స్ అంతా కూడా చిరు సినిమా మరో హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నారు. వశిష్ట సినిమా అంచనాలను మించి ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి వశిష్ట తర్వాత అయినా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

Also Read : Bigg Boss 7 : నలుగురు అమ్మాయిలే ఎలిమినేట్.. ఏం జరుగుతుంది..?

We’re now on WhatsApp. Click to Join

Exit mobile version