Thalapathy Vijay GOAT లియో తర్వాత దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా G.O.A.T. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దళపతి విజయ్ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ గా వస్తుందని అంటున్నారు.
హాలీవుడ్ సినిమా జెమిని మ్యాన్ సినిమాలో కూడా విల్ స్మిత్ డ్యుయల్ రోల్ లో నటించాడు. తండ్రి కొడుకులుగా విల్ స్మిత్ నటన ఆకట్టుకుంది.
We’re now on WhatsApp : Click to Join
కోవిడ్ టైం లో డైరెక్ట్ గా ఓటీటీ రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది జెమిని మ్యాన్. అయితే ఈ సినిమా కథతోనే విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా చేస్తున్నారని అంటున్నారు. విజయ్ జి.ఓ.ఏ.టి సినిమా జెమిని మ్యాన్ కి ఫ్రీమేకా లేదా వెంకట్ ప్రభు నిజంగానే కొత్త కథతో ఈ సినిమా చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాను ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. కె.జి.ఎఫ్ తర్వాత కోలీవుడ్ లోనే విక్రం కోబ్రా సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి విజయ్ జి.ఓ.ఏ.టితో మరోసారి తమిళ ఆడియన్స్ ని అలరించనుంది.
Also Read : Pushpa 2 Devi Nagavalli : సుకుమార్ అసిస్టెంట్ గా దేవి నాగవల్లి..!