Sudheer Babu Haromhara ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు హీరోగా జ్ఞానసార్ ద్వారక డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హరోం హర. సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సినిమాకు చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆరోజున చాలా సినిమాలు రిలీజ్ ఉండటం వల్ల పోటీ తట్టుకోలేక సుధీర్ బాబు సినిమా వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారట.
మే 31న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గం గం గణేషా, కాజల్ సత్యభామ, కార్తికేయ భజే వాయి వేగం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో విశ్వక్ సేన్ సిఒనిమాకు ఎక్కువ బజ్ ఉంది. అయితే మిగతా సినిమాలు కూడా ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టఫ్ ఫైట్ లో రావడం కన్నా వాయిదా వేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
సుధీర్ బాబు హరోమ్హర సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా సోలో రిలీజ్ అయితే కాస్త కూస్తో ఆడియన్స్ దగ్గరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఐదారు సినిమాల మధ్య వస్తే ఆడియన్స్ పట్టించుకునే అవకాశం లేదు. అందుకే సుధీర్ బాబు అండ్ టీం సినిమాను రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.
సినిమా ఫలితాలు ఎలా ఉన్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపని సుధీర్ బాబు ఖాతాలో ఒక సూపర్ హిట్ పడితే మాత్రం ఆ తర్వాత లెక్క వేరేగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సుధీర్ ఆ ఒక్క హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Balakrishna Birthday : బాలయ్య బర్త్ డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ రెడీ..!