Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సంతన తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సినిమా పరంగా ఎంత గ్యాప్ వచ్చినా సోషల్ మీడియా ఫాలోవర్స్ కి తనకు

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 03:10 PM IST

Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సంతన తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సినిమా పరంగా ఎంత గ్యాప్ వచ్చినా సోషల్ మీడియా ఫాలోవర్స్ కి తనకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది అమ్మడు. ఖుషి తర్వాత తెలుగులో సినిమాలను సైన్ చేయలేదు. లేటెస్ట్ గా సమంత తన సొంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది. ఇదిలాఉంటే సమంత ఇన్ స్టా గ్రాం స్టేటస్ ఎప్పటికప్పుడు తన మనసులోని భావాలను వ్యక్త పరుస్తుంది.

లేటెస్ట్ గా సమంత నువ్వు గెలవాలని కోరుకుంటున్నా అంటూ ఒక కామెంట్ పెట్టింది. అది ఏ ఉద్దేశంతో పెట్టింది.. ఎవరి గురించి పెట్టింది అన్నది తెలియదు కానీ నేడు జరగబోతున్న ఐపిఎల్ మ్యాచ్ కు ఆర్.సీ.బికి సపోర్ట్ గా సమంత ఆ మెసేజ్ పెట్టిందని హడావిడి చేస్తున్నారు. సమంత నిజంగానే బెగళూరు గెలవాలని అనుకుంటున్నా. ఐపిఎల్ సమంత కూడా చూస్తుందా అన్న డౌట్లు మొదలయ్యాయి.

సమంత మాత్రం ఎలాంటి క్లూ లేకుండా కేవలం నువ్వు గెలవాలని అనుకుంటున్నా అంటూ మెసేజ్ పెట్టి సైలెంట్ అయ్యింది. ఆ మెసేజ్ తో సోషల్ మీడియా ఆర్.సీ.బి ఫ్యాన్స్ అంతా నేడు రాజస్థాన్ తో క్వాలిఫైర్ కోసం ఆర్.సీ.బి ఆడే మ్యాచ్ గురించి పెట్టిందని. బెంగళూరు గెలవాలనే సమంత కోరుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా సమంత పెట్టిన ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తూ ఆర్.సీ.బి ఫ్యాన్స్ అంతా హడావిడి చేస్తున్నారు.