Site icon HashtagU Telugu

Samantha: “కాఫీ విత్ కరణ్”లో సమంత.. టాక్ షోలో హాట్ డిబేట్!?

Samantha

Samantha

బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా చేస్తోన్న ’కాఫీ విత్‌ కరణ్‌’ షో లో కీలక పరిణామం జరగబోతోంది. పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలతో దుమ్ములేపుతున్న సౌత్ ఇండియా స్టార్లతో ’కాఫీ విత్‌ కరణ్‌’ కొత్త సీజన్ మొదలు కాబోతోంది. ఇందులో స్టార్ బ్యూటీ సమంత కూడా పాల్గొన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కాఫీ విత్‌ కరణ్‌ షో.. ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది.

త్వరలోనే ఏడో సీజన్‌ మొదలు కాబోతోంది. ఈ సారి ఓటీటీలో ఇది ప్రసారం కాబోతోంది. తాను ” కాఫీ విత్ కరణ్‌” షోలో పాల్గొన్నాననే సంకేతాలిస్తూ జూన్ 7వ తేదీన ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఒక పోస్ట్ చేశారు. రెడ్ టాప్, పింక్ ప్యాంట్ లో దిగిన ఒక ఫోటోను షేర్ చేశారు.
దానికి ఒకరోజు ముందు(జూన్ 6) ..కాఫీ విత్‌ కరణ్‌ షో షూటింగ్ లో ఆమె పాల్గొన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే సమంత ను ఈ షోలో కరణ్‌ జోహార్‌ ఏ ప్రశ్నలు అడిగారు ? వాటికి సమంత ఎలాంటి సమాధానాలు చెప్పారు ? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనిపై నెటిజన్స్ మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది.

హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. డైరెక్ట్ గా ఒక టాక్ షో లో సమంత పాల్గొనడం ఇదే తొలిసారి. అసలు ఆ షోలో సమంత పాల్గొన్నారా? నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version