Raviteja పొంగల్ కి సినిమాల ఫైట్ కామనే. కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా స్టార్ సినిమాలన్నీ బాక్సాఫీస్ రేసులో దిగుతాయి. ఆ టైం లో స్టార్ వార్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రతి సంక్రాంతి లానే రాబోతున్న 2024 సంక్రాంతికి స్టార్ వార్ షురూ అవుతుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం రిలీజ్ లాక్ చేయగా వెంకటేష్ సైంధవ్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయ్యారు. రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ (Eagle) సినిమా కూడా పొంగల్ వార్ లో దిగుతుంది.
వీటితో పాటుగా ప్రశాంత్ వర్మ హనుమాన్ (Hanuman), నాగార్జున నా సామిరంగ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతాయని అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి వస్తున్నాడు. కానీ రవితేజ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) ఇచ్చిన షాక్ వల్ల సంక్రాంతి రేసు నుంచి ఈగల్ ని తప్పించాలని చూస్తున్నారని టాక్. టైగర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా అది కాస్త తుస్సుమన్నది.
Also Read : Bigg Boss 7 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరెవరు.. రిస్క్ ఎవరికంటే..?
సంక్రాంతికి ఈగల్ ని తెస్తే ఆ స్టార్ ఫైట్ లో కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే రవితేజ ఈగల్ సంక్రాంతి మిస్ చేసి తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక మరోపక్క హనుమాన్ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తే సరైన స్కోప్ ఉంటుందో లేదో అని సంక్రాంతిని స్కిప్ చేస్తారని తెలుస్తుంది.
నాగార్జున (Nagarjuna) నా సామిరంగ కూడా పొంగల్ కి రావడం కష్టమే అంటున్నారు. సో సంక్రాంతికి రవితేజ, హనుమాన్, నాగార్జున వెనక్కి తగ్గితే కేవలం మహేష్, వెంకటేష్, విజయ్ దేవరకొండల మధ్య ఫైట్ ఉంటుంది.
We’re now on WhatsApp : Click to Join