Site icon HashtagU Telugu

Pushpa2: పుష్ప కేశవను నిర్మాతలు బయటకు తీసుకొస్తారా?

Keshava Arrest

Keshava Arrest

Pushpa2: ఇటీవలే ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ అరెస్టుతో సినీ ప్రేమికులు షాక్ అయ్యారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కేసులో ఆధారాలు లభించడంతో సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద అతనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి పుష్ప సిరీస్‌లో జగదీష్ కేశవ పాత్రను పోషించడం, అల్లు అర్జున్‌తో పాటు సినిమా అంతటా కనిపించే నటుడి కావడంతో మూవీ టీం షాక్ అయ్యింది.

వాస్తవానికి జగదీష్‌ 14 రోజుల రిమాండ్‌ లో ఉన్నాడు.  సినిమా షూట్ సజావుగా సాగడానికి అతన్ని బెయిల్‌పై బయటకు తీసుకురావడానికి ఇప్పుడు 2 వారాలు పడుతుంది. అతడికి బెయిల్ ఇప్పించేందుకు చిత్ర నిర్మాణ బృందం ప్రయత్నిస్తోందని, రిమాండ్ పూర్తయిన తర్వాత అది జరుగుతుందని తెలుస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, జగదీష్ హాజరు అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

మహిళ ఆత్మహత్య కేసులో జగదీష్ పాత్ర ఎంతవరకు ఉందనేది కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం పుష్ప 2 బృందం షూట్‌ను సజావుగా ముగించేలా అతన్ని బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు టాలీవుడ్ టాక్.

Also Read: Minister Seethakka: మేడారం జాతరలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క