Site icon HashtagU Telugu

NTR Devara : దేవర రిలీజ్ పై ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్.. ఆ కారణాలతో వాయిదా వేస్తారా..?

Is NTR Devara Release Planing to Postpone

Is NTR Devara Release Planing to Postpone

NTR Devara యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. అయితే అందుకు తగినట్టుగా సినిమా పూర్తి చేసేలా చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ పునరాలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

దేవర సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లోనే భారీ క్రేజ్ తో రాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై గ్లోబల్ వైజ్ క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమా అంచనాలకు తగినట్టుగా చేయాలంటే స్పీడ్ గా చుట్టేయకూడదని అనుకున్నారు.

ఇక మరోపక్క ఈ సినిమా ఏప్రిల్ రిలీజ్ అనుకుంటుండగా అదే టైం కు ఏపీలో ఎలక్షన్స్ హడావిడి వచ్చేలా ఉంది. ఆ టైం లో సినిమా రిలీజ్ అయితే కష్టమే అని మేకర్స్ అనుకుంటున్నారు. మరోపక్క దేవర పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఏప్రిల్ లోనే అజయ్ దేవగన్ నటించిన మైదాన్, అక్షయ్ కుమార్ నటించిన బడే మియా చోటే మియా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు భారీ రిలీజ్ కాబోతున్నాయి.

సో అలాంటి టైం లో దేవరకు తగినన్ని థియేటర్స్ ఉండే ఛాన్స్ లేదు. ఓ పక్క ఏపీలో ఎలక్షన్స్ మూమెంట్ కూడా ఉంది. సో ఈ రెండిటి దృష్టిలో పెట్టుకుని దేవర రిలీజ్ వాయిదా వేసే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. ఎన్.టి.ఆర్ కొరటాల శివ ఇద్దరు ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చే సినిమా చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Devara: ఆస్పత్రిలో దేవర విలన్, ట్రీట్ మెంట్ తీసుకున్న సైఫ్ అలీఖాన్