Site icon HashtagU Telugu

Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!

Nani

Nani

Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టును పక్కన పెట్టగా సుజీత్ కొత్త నిర్మాత కోసం వేట సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు కొందరు నిర్మాతలు రేసులో ఉన్నారు.

నాని తన రెమ్యునరేషన్ ను పెంచుతూ వస్తున్నాడు.ఆయనకు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉంది. కానీ సుజీత్ సినిమా బడ్జెట్ నాని మార్కెట్ ను మించిపోవడంతో దానయ్య రిస్క్ కు సిద్ధంగా లేడు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.