Site icon HashtagU Telugu

Naga Chaitanya: సమంతతో బ్రేకప్ తర్వాత శోభితతో చైతూ డేటింగ్?

Nagachaitanya

Nagachaitanya

గత ఏడాది అక్టోబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించినప్పట్నుంచీ అటు సమంత, ఇటు నాగచైతన్య తరచుగా వార్తలో నిలుస్తున్నారు. అయితే సామ్ తో చైతూ విడిపోయినప్పట్నుండే మేజర్ ఫేం నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడు. నటుడు శోభితతో కలిసి తన కొత్త ఇంటిలో కనిపించాడు. తరుచగా వీళ్లిద్దరు మీడియాకు చిక్కుతున్నారు. గతనెల జూబ్లీహిల్స్ లో నాగచైతన్య కొత్త ఇంట్లోకి మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శోభితతో నవ్వులు చిందిస్తూ తన ఇంటిని చూపించాడు. ఆ తర్వాత ఒకే కారులో వెళ్లిపోయారు.

మేజర్ ప్రచారం కోసం శోభిత బస చేసిన హోటల్‌లో నాగచైతన్య కనిపించడం కూడా వార్తలకు మరింత బలాన్నిస్తోంది. సమంత, నాగ చైతన్య అక్టోబర్ 2017 లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ జంట గోవాలో కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఐదవ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు, వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.