Site icon HashtagU Telugu

Naga Chaitanya-Samantha: నాగచైతన్య, సమంత మళ్లీ కలిశారా.. చక్కర్లు కొడుతున్న రూమర్స్

Samantha

Samantha

Naga Chaitanya-Samantha: టాలీవుడ్ మాజీ జంట నాగచైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు అవుతున్నా.. నేటికి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల నాగచైతన్య దగ్గర సమంత పెంపుడు కుక్క కనిపించింది. దీంతో ఇంటర్నెట్లో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. సమంత దగ్గర ఉండాల్సిన పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉందంటూ అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నాగ చైతన్య, సమంత మళ్ళీ కలుస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుందని అంటున్నారు.

నాగచైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఫ్రెంచ్ డాగ్ ఉండేది. అది సమంత పెంపుడు కుక్క అయినప్పటికీ నాగచైతన్యకి కూడా బాగా అలవాటయ్యింది. గత కొంతకాలం నుండి ఆ కుక్క సమంత దగ్గరే ఉంది. ప్రస్తుతం సడెన్ గా నాగచైతన్య వద్ద ఆ పెంపుడు కుక్క కనిపించింది. దీంతో వారిద్దరు మళ్లీ కలిశారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Assembly Elections: మోగిన ఎన్నికల నగారా, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!