Mrunal Thakur : మృణాల్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా..?

తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా సూపర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur Watching her Favourite movie

తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా సూపర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. సీతారామం తర్వత నానితో హాయ్ నాన్న సినిమా చేసిన అమ్మడు ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో లవర్ గా వైఫ్ గా విజయ్ తో జతకట్టింది అమ్మడు.

అయితే ఈ సినిమా తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది మృణాల్ ఠాకూర్. ఇప్పటికే తెలుగులో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది మృణాల్. ఆల్రెడీ పరశురాం విజయ్ దేవరకొండ గీతా గోవిందం (Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సో ఈ సినిమా కూడా ఆ హిట్ సెంటిమెంట్ తో వస్తుంది.

మృణాల్ లక్కీ హ్యాండ్ కూడా తోడైంది కాబట్టి ఫ్యామిలీ స్టార్ (Family Star) కు అన్ని కలిసి వచ్చే అంశాలే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువైందన్న టాక్ వినిపిస్తుంది. అనుకున్న దానికన్నా మరో 10, 15 కోట్లు ఎక్కువ ఖర్చు చేయించారట. ఫారిన్ ఎపిసోడ్స్ అనుకున్న ప్రకారం పూర్తి కాలేదని వాటి వల్ల ఎక్కువ బడ్జెట్ అయ్యిందని అంటున్నారు.

ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సమ్మర్ లో స్టార్ సినిమాలన్నీ తప్పుకోగా సోలోగా వస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో ఎలాంటి సత్తా చాటుతాడన్నది చూడాలి.

Also Read : Hanuman : OTTలో 8 నిమిషాల కత్తిరింపుతో హనుమాన్.. రీజన్ ఏంటంటే..?

  Last Updated: 18 Mar 2024, 08:37 AM IST