Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ ఇక మీద గోల్డ్ స్టార్..?

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Is Mahesh Babu Tag Change From Super Star to Gold Star

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ ఇక మీదట ఆయన్ను సూపర్ స్టార్ అని కాకుండా వేరే పేరుతో పిలుస్తారా. ఆయన ట్యాగ్ కూడా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా విషయంలో ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండేలా చేస్తున్నాడు జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఈమధ్యనే జస్ట్ సినిమా టైటిల్ ఒకటి అలా లీక్ అయ్యింది.

టైటిల్ జస్ట్ అది కూడా ఒక రూమర్ లాగా వస్తే దాన్ని సెన్సేషనల్ చేసేశారు. ఈ ఇంపాక్ట్ ని బట్టి చూస్తే రాజమౌళి మహేష్ కాంబో సినిమా గురించి ఆడియన్స్ లో ఎంత ఎగ్జైట్ మెంట్ ఉంది అన్నది అర్ధమవుతుంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు గోల్డ్ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. అదే నిజమైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

ఐతే RRR సినిమా తర్వాత చరణ్, తారక్ లకు తన స్క్రీన్ నేం లు మారిపోయాయి. ఇద్దరు కూడా ఆ సినిమాతో ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చుకోగా చరణ్ కి గ్లోబల్ స్టార్ అని.. ఎన్ టీ ఆర్ ఏమో మాన్ ఆఫ్ మాసెస్ అని ఫిక్స్ చేశారు. ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ని కూడా గోల్డ్ స్టార్ (Gold Star) అనేస్తారేమో అని ఆడియన్స్ డిస్కస్ చేస్తున్నారు.

సూపర్ స్టార్, గోల్డ్ స్టార్ పేరు ఏదైనా కనిపించే కటౌట్ ఒక్కటే అదే మహేష్ బాబు. మామూలుగానే మహేష్ ని చూసి చాలామంది హాలీవుడ్ స్టార్ లా ఉన్నాడని అంటారు. ఇప్పుడు అదే రేంజ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి తెలుగు కాదు కాదు ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ ఏ సినిమా అయితే ఉందో ఆ సినిమా రికార్డుల నుంచే మహేష్ సినిమా రికార్డుల జాతర మొదలవుతుందని చెప్పొచ్చు.