Site icon HashtagU Telugu

King Nagarjuna : నాగార్జున గారు ఏంటండీ ఇది..!

Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky

Bigg Boss 8 Nagarjuna Remuneration is in Sky

King Nagarjuna నా సామిరంగ సక్సెస్ తర్వాత కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ఐతే నాగార్జున లేట్ వెనక చాలా రీజన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న నాగార్జున ఆ సినిమా తర్వాత అయినా సోలో సినిమా మొదలు పెడతాడు అనుకుంటే అది జరగలేదు సరికదా మరో సినిమా స్టార్ హీరోకి విలన్ గా నటిస్తాడంటూ వార్తలు జోరందుకున్నాయి.

కింగ్ నాగార్జున ఏంటి విలన్ రోల్ ఏంటి అనుకోవచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అప్డేట్స్ ప్రకారం నాగార్జున సూపర్ స్టార్ రజినికాంత్ (Superstar Rajinikanth) సినిమాలో విలన్ గా నటిస్తున్నాడట. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా చేస్తున్నారని కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. ఈ విషయంలో ఎంత నిజం ఉంది అన్నది బయటకు రావాల్సి ఉంది.

ఇది ఒకవేళ నిజమే అయితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. కెరీర్ మంచి స్వింగ్ మీద ఉన్నప్పుడు ఎంత బాగా నచ్చినా సరే విలన్ రోల్స్ చేయడం అనేది సరికాదు. అంతేకాదు తెలుగులో సీనియర్ స్టార్ అయిన నాగార్జున (Nagarjuna) తమిళ హీరోకి విలన్ గా చేస్తే కచ్చితంగా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.

నాగార్జున కుబేర సినిమా చేస్తున్నాడని తెలిసే ఎందుకిలా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రజినికి విలన్ అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఐతే ఫ్యాన్స్ మాత్రం కింగ్ (King) సోలో సినిమా త్వరగా అనౌన్స్ చేసి సెట్స్ మీదకు వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారు. చూస్తుంటే నాగ్ సార్ ఇలా సెకండ్ హీరోగానే ఈ ఏడాది సినిమాలన్నీ చేసేల ఉన్నారు. ఓ పక్క మహేష్ రాజమౌళి సినిమాలో కూడా నాగార్జున ఉంటారన్న టాక్ వినిపిస్తుంది.

Also Read : NTR : దేవర ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న అతను..?