రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె ఫిమేల్ లీడ్ గా నటించింది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ప్రభాస్ స్టామినా మరోసారి చూపించేలా కల్కి సినిమా 1000 కోట్లను దాటేసింది. ఐతే కల్కి సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) కనిపించలేదు కానీ ఆమె వాయిస్ వినిపించింది.
సినిమాలో భైరవ అదే మన ప్రభాస్ (Prabhas) కి తోడుగా బుజ్జి కి డబ్బింగ్ చెప్పింది కీర్తి సురేష్. ఇద్దరి మధ్య డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఐతే బుజ్జికి డబ్బింగ్ కన్నా ముందు కల్కి (Kalki) సినిమాలో కీర్తి సురేష్ ని నాగ్ అశ్విన్ ఒక పాత్రకు అనుకున్నారట. అది కీర్తి సురేష్ తో కూడా డిస్కస్ చేశారట. తనకు మహానటి (Mahanati)తో నేషనల్ అవార్డ్ ఇప్పించిన నాగ్ అశ్విన్ ఎలాంటి పాత్ర ఇచ్చినా కీర్తి నో చెప్పే ఛాన్స్ లేదు.
కల్కిలో కీర్తి వాయిస్ మాత్రమే..
ఐతే కీర్తి చేయాలని అనుకున్నా కూడా నాగ్ అశ్విన్ మళ్లీ పాత్ర వద్దని చెప్పి డబ్బింగ్ ఒక్కటే చేయించాడట. అలా కల్కిలో కీర్తి వాయిస్ మాత్రమే వినిపించింది. ఐతే కల్కి సినిమాకు పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు కీర్తి సురేష్. సినిమా పార్ట్ 2 కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పరిచయం చేసిన కీర్తి సురేష్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తన పెళ్లి గురించి కూడా ఓపెన్ అయ్యింది.
Also Read : Pomegranate: వీరు పొరపాటున కూడా దానిమ్మ తినకూడదు!