Site icon HashtagU Telugu

Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా?

Keerthy Suresh

Keerthy Suresh

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) రిలేషన్షిప్ స్టేటస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ సౌత్ స్టార్ మ్యూజిషియన్స్‌లో ఒకరితో కీర్తి సురేష్ సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మ్యూజిక్ ఆర్టిస్ట్ తో కీర్తి సురేష్‌కు ఉన్న సంబంధం గురించి ఎటువంటి స్పష్టత లేనప్పటికీ, ఈ వార్త  వైరల్‌గా మారింది. కీర్తి సురేష్ (Keerthy Suresh) కేరళకు చెందిన తన చిన్ననాటి ఫ్రెండ్ ను  ప్రేమిస్తున్నట్లు (Love Marriage) వార్తలు వస్తున్నాయి. కీర్తి ప్రియుడుకి కొచ్చి, చుట్టుపక్కల విలాసవంతమైన రిసార్ట్‌లు ఉన్నాయని,  కొన్ని నెలల క్రితం కీర్తి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు కూడా టాక్ వినిపించింది.

తాజా సమాచారం ఏంటంటే.. కీర్తి సురేష్ రాబోయే కొద్ది నెలల్లోనే తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కీర్తి సురేష్ కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదని సమాచారం. వృత్తిపరంగా, ప్రస్తుతం కీర్తి సురేష్ (Keerthy Suresh) దసరా షూటింగ్‌ని రెండు నెలల పాటు ముగించి ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. మరోవైపు చిరంజీవి భోళా శంకర్ మూవీలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పటికే సినిమాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ కు కండీషన్స్ పెడుతుందట.

Also Read: Tip Tip Barsa Paani: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సెక్సీ డ్యాన్స్.. వీడియో వైరల్!