Kaikala: పద్మకు నోచుకోని ‘నవరస నటనాసార్వభౌముడు’

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ సినీ కెరీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లకుపైగా సినీ జీవితం, 750కు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు,

Published By: HashtagU Telugu Desk
Kaikala

Kaikala

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ సినీ కెరీర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లకుపైగా సినీ జీవితం, 750కు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు, ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపో గల ప్రతిభ, ఎలాంటి డైలాగ్‌నైనా అనర్గళంగా చెప్పగలిగే గళం, నవరస నటనాసార్వభౌముడు అని ముద్దుగా పిలిపించుకున్న కళామతల్లి ముద్దు బిడ్డ.. ఇన్ని అర్హతలు ఉన్న నటుడు పద్మ అవార్డుకు అర్హులు కారా? ఇదే ప్రస్తుత చర్చ. సగటు తెలుగు ప్రేక్షకుడి ఆవేదన, రెండు రోజులుగా ప్రభుత్వాలను నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివి.

వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన కైకాల సత్యనారాయణను పద్మ అవార్డుకు అర్హులు కారా? రాష్ట్ర విభజనకు ముందుగానీ, తరువాత కానీ ఆయన పేరును పద్మ అవార్డుకు ప్రభుత్వాలు ఎందుకు సిఫార్సు చేయలేకపోయాయి? ప్రతిభకు పట్టం కడితేనే కదా సినీ పరిశ్రమ మరింత కలర్‌ఫుల్‌గా ఉంటుంది అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం కొందరు ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. అంతే కాదు కైకాల లాంటి ఎంతోమంది సీనియర్లు ప్రతిభ ఉండి కూడా సరైన గుర్తింపునకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 28 Jan 2022, 11:53 AM IST