Ileana D’Cruz Dating: ఆ బాలీవుడ్ హీరోయిన్ బ్రదర్ తో ఇలియానా డేటింగ్!

డేటింగ్.. బ్రేకప్ అనే పదాలు బాలీవుడ్ లో తరుచుగా వినిపిస్తుంటాయి.

  • Written By:
  • Updated On - July 18, 2022 / 04:57 PM IST

డేటింగ్.. బ్రేకప్ అనే పదాలు బాలీవుడ్ లో తరుచుగా వినిపిస్తుంటాయి. ఇవాళ ఒకరితో, రేపు మరొకరితో అన్నట్టుగా బాలీవుడ్ హీరోయిన్స్ వ్యవహరిస్తున్నారు. ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానాపై డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి. ఆదివారం విక్కీ కౌశల్, సన్నీ కౌశల్, ఆనంద్ తివారీ, ఇసాబెల్లె కైఫ్.. కత్రినా కైఫ్‌తో సందడి చేశారు. కత్రినా బర్త్ డే సందర్భంగా (39వ) అందరూ ఒక్కటై మల్దీవ్స్ లో సరాదాగా గడిపారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో వైరల్ గా మారాయి. అయితే పోకిరీ ఫేం ఇలియానా డి’క్రూజ్ పార్టీలో సందడి చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.

ఇలియానా గత 6 నెలలుగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్ చేస్తోన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బాంద్రాలోని కత్రినా పాత అపార్ట్ మెంట్ లో ఏకాంతంగా గడిపినట్టు బాలీవుడ్ టాక్ కూడా. ఈ విషయమై సెబాస్టియన్ లారెంట్‌, ఇలియానా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కానీ డేటింగ్ చేస్తున్నట్టు మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకుముందు, ఇలియానా తన చిరకాల ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో విడిపోయింది. ప్రస్తుతం ఇలియానా డి’క్రూజ్ తదుపరి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో కనిపించనుంది. మరోవైపు కత్రినా కైఫ్ ఫోన్ భూత్, జీ లే జరా, టైగర్ 3 సినిమాలతో బిజీగా ఉంది.