Gangs Of Godhavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ హీరో చేయాల్సిందా..?

Gangs Of Godhavari విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో నేహా శెట్టి

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 09:24 AM IST

Gangs Of Godhavari విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్ ఎక్కువైందని అది ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేదని అంటున్నారు. ఐతే విశ్వక్ మాస్ యాక్టింగ్ అతని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాను ముందు ఒక హీరో కోసం రాసుకున్నారట. కానీ ఆ ప్రాజెక్ట్ ఎంతకీ ముందుకు వెళ్లకపోవడంతో విశ్వక్ తో కలిసి కానిచ్చారు. ఇంతకీ కృష్ణ చైతన్య చేయాలనుకున్న హీరో ఎవరంటే నితిన్ అని తెలుస్తుంది. ఆల్రెడీ నితిన్ తో చల్ మోహన్ రంగ సినిమా చేశాడు కృష్ణ చైతన్య. మరోసారి నితిన్ తో పవర్ పేట అనే సినిమా చేయాలని అనుకున్నాడు. కొన్నాళ్లు షూట్ కూడా జరిగిందని టాక్.

ఐతే అదే కథను విశ్వక్ సేన్ కి చెప్పి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేశాడని అంటున్నారు. మరి నితిన్ తో అనుకున్న కథే ఇదా కాదా అన్నది తెలియదు కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూస్తే ఇది నితిన్ కన్నా విశ్వక్ సేన్ కే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సీక్వెల్ కూడా ఆఫ్టర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు డైరెక్టర్ కృష్ణ చైతన్య.