Site icon HashtagU Telugu

KGF Third Part : కె.జి.ఎఫ్ 3 హీరో మారుతున్నాడా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

Is Hero Changed For Kgf Third Part What Prashanth Varma Cooking

Is Hero Changed For Kgf Third Part What Prashanth Varma Cooking

KGF Third Part కె.జి.ఎఫ్ ముందు వరకు కేవలం కన్నడలో మాత్రమే డైరెక్టర్, హీరోగా ఉన్న ప్రశాంత్ నీల్, యశ్ ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు. కె.జి.ఎఫ్ 1, 2 రెండు భాగాలతో నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకుని సత్తా చాటారు. కె.జి.ఎఫ్ 1 తోనే ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిన ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించాడు. అక్కడే ప్రశాంత్ వర్మ మాస్టర్ క్లాస్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక కె.జి.ఎఫ్ 2 తర్వాత ప్రభాస్ తో సలార్ 1 (Salaar 1) గా వచ్చి సత్తా చాటాడు. ప్రభాస్ లాంటి భారీ కటౌటు ఉన్న హీరోకి పర్ఫెక్ట్ సినిమా గా సలార్ ఇచ్చాడు. ఐతే సలార్ 1 తో కూడా సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ సలార్ 2 ని కూడా త్వరలోనే మొదలు పెట్టాలని చూస్తున్నాడు. కె.జి.ఎఫ్ 2 చివర్లో కె.జి.ఎఫ్ థర్డ్ చాప్టర్ అదే మూడో భాగం కూడా ఉంటుందని హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

Also Read : Yash Taxic : అందగత్తెలందరినీ దించుతున్నారా.. యశ్ టాక్సిక్ అప్డేట్..!

ఐతే లేటెస్ట్ గా దాని గురించి క్లారిటీ వచ్చింది. కె.జి.ఎఫ్ 3 (KGF 3) కథ దాదాపు పూర్తైందట. సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ 3 లో హీరో మారుతున్నాడని లేటేస్ట్ టాక్. అదేంటి అంటే కె.జి.ఎఫ్ ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్ 3 లో కోలీవుడ్ స్టార్ అజిత్ ని తీసుకుంటున్నారట ప్రశాంత్ నీల్. అజిత్ కూడా ఇలాంటి గ్యాంగ్ స్టర్ సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తూ ఉంటాడు. సో అలాంటి హీరోకి కె.జి.ఎఫ్ లాంటి కథ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాడు.

ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ 3 ని అజిత్ (Ajith) తో చేస్తాడని తెలిసి యశ్ ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. ఐతే కె.జి.ఎఫ్ 3లో యశ్ కూడా ఉంటాడు కానీ అసలు హీరో అజిత్ అని కథ కొనసాగింపు ఇలానే ఉంటుందని ప్రశాంత్ వర్మ టీం చెబుతున్నారు.