Boyfriend Of Janhvi? అతడే జాన్వీ భాయ్ ఫ్రెండ్.. చక్కర్లు కొడుతున్న రూమర్స్!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో తాను ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, సంతోషంగా ఒంటరిగా

Published By: HashtagU Telugu Desk
Janhvy

Janhvy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో తాను ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, సంతోషంగా ఒంటరిగా ఉన్నానని స్పష్టం చేసింది. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయడం తనకు అభ్యంతరం లేదని, అయితే ‘లైగర్’ హీరో ఇప్పటికే మరో హీరోయిన్‌తో ఫిక్స్ అయ్యాడని, జాన్వీకి కమిట్ అవ్వలేదని చెప్పినప్పటికీ, ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.

ఆమె ఓర్హాన్ అవత్రామణితో రిలేషన్ షిప్‌లో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హాలోవీన్, దీపావళి, ఇతర సందర్భాలలో కలిసి చాలా సమయం గడుపుతున్నారు. ఓర్హాన్ వారితో కలిసి ఉన్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. వీరిద్దరి గురించి మరింత తెలుసుకోవాలని బాలీవుడ్ మీడియా ఆసక్తిగా ఉంది.

జాన్వీ ఇటీవల మాట్లాడుతూ.. “నాకు ఓర్రీ చాలా సంవత్సరాలుగా తెలుసు. అతనితో నేను చాలా క్లోజ్ గా ఉంటాను. నాకున్న స్నేహితుల్లో మంచి స్నేహితుడు. అతను నా ఫ్రెండ్ గా ఉండటం గొప్పగా భావిస్తున్నా’’ అని చెప్పింది. కాగా కాన్వీ, ఆమె చెల్లి కుషి కపూర్ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. కానీ జాన్వీ ఆ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం జాన్వీ నటించిన ‘మిలి’ నవంబర్ 4న విడుదలైంది. ఛాలెంజింగ్ పాత్రలను చేస్తూ నటిగా తనను తాను ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తన గ్లామర్ షోను తన సినిమాల ప్రమోషన్స్ కోసం బాగా వాడుకుంటోంది జాన్వీ.

  Last Updated: 09 Nov 2022, 05:51 PM IST