Keerthy Suresh BF: అతడే కీర్తి భాయ్ ఫ్రెండ్.. దసరా బ్యూటీ రియాక్షన్ ఇదే!

కీర్తి సురేశ్ ఓ వ్యక్తితో కలిసిన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక పుకార్లు వస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Keerthy Suresh

Keerthy Suresh

అందాల భామ కీర్తి సురేశ్ మ్యారేజ్, డేటింగ్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యూటీ కేరళ బిజినెస్ మేన్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ ఓ వ్యక్తితో కలిసిన ఉన్న ఫొటో వైరల్ గా మారింది. ఇద్దరు సేమ్ కలర్ డ్రస్సులు వేసుకొని నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు కీర్తి సురేశ్ స్పందించింది. తాను కేవలం ఓ ఫ్రెండ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.

ఫర్హాన్ బిన్ లియాఖత్ పుట్టినరోజును జరుపుకున్నాడు. కీర్తి సురేశ్ అతనికి విష్ చేస్తూ “హ్యాపీ బర్త్‌డే ఫర్హానీ…అదిపోలీ ఇయర్ ఎడ్ ఎహెడ్ డా…” అంటూ ఇన్ స్టాలో క్యాప్షన్ ఇచ్చింది. దీంతో  కీర్తి సురేశ్ పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్స్ వినిపించడం మొదలైంది. కీర్తి బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ‘‘కేవలం స్నేహితులు మాత్రమే’’ అంటూ రియాక్ట్ అయ్యింది.

బహుభాషా నటి కీర్తి సురేష్ ‘నేను శైలజ’లో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దసరా, సర్కారు వారి పాట సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ‘మహానటి’కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో సహా పలు అవార్డుల ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ఈ బ్యూటీ పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ కూడా వార్తలొస్తున్నాయి.

Also Read: Balagam Singers: బల‌గం సింగర్స్ మొగిల‌య్య‌, కొముర‌మ్మ‌ల‌కు ద‌ళిత బంధు!

  Last Updated: 17 May 2023, 05:19 PM IST