లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) తో తెలుగులో ముచ్చటగా మూడు హిట్లతో హ్యాట్రిక్ అందుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). అతను చేస్తున్న సినిమాలు తెలుగులో ఇలా వరుస సక్సెస్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. మహానటి టైంలో తెలుగు ఆఫర్ అనగానే తనకు రాదని కాదని చెప్పాలని అనుకున్న దుల్కర్ కట్ చేస్తే ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత సీతారామం చేసి దాన్ని బ్లాక్ బస్టర్ అందుకుంది లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన లక్కీ భాస్కర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాతో దుల్కర్ హ్యాట్రిక్ హిట్ పూర్తి చేశాడు. ఐతే తను పార్ట్ టైం గా చేస్తున్న తెలుగు సినిమాలు వరుస హిట్లు అవ్వడం దుల్కర్ కి చాలా సంతోషంగా ఉంది. అందుకే దుల్కర్ తో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.
హిట్టు పడ్డాక రెమ్యునరేషన్ పెంచడం..
ఇదిలాఉంటే హిట్టు పడ్డాక రెమ్యునరేషన్ పెంచడం కామనే ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ కూడా తన రెమ్యునరేషన్ పెంచాడని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకు 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న దుల్కర్ ఇక నుంచి 10 కోట్లు కావాలని అంటున్నాడట. ఈమధ్యనే రానాతో దుల్కర్ మరో సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ బైలింగ్వల్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ (Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తుంది. లక్కీ భాస్కర్ హిట్ తో తెలుగులో పూర్తి స్థాయిగా తన సత్తా చాటినట్టే అని చెప్పొచ్చు. సో దుల్కర్ అటు మలయాళ ఇటు టాలీవుడ్ రెండు కవర్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ హౌజ్ లోకి విష్ణు ప్రియ అందుకే వెళ్లిందా..?