Site icon HashtagU Telugu

Jai Hanuman : జై హనుమాన్.. చిరు కన్విన్స్ అయితే మాత్రం..!

Is Chiranjeevi Green signal for Prashanth Varma

Is Chiranjeevi Green signal for Prashanth Varma

Jai Hanuman ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ! నుంచి తన ప్రతిభ చాటుతూనే ఉన్నాడు. అ! తో మొదలు పెట్టి హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు హనుమాన్. తేజ సజ్జ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ప్రశాంత్ వర్మ. లాస్ట్ ఇయర్ 300 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఆదిపురుష్ కన్నా ఈ సినిమా 100 రెట్లు నయం అని అన్నారు ఆడియన్స్. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమా 300 కోట్లు సాధించింది.

ఐతే ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ మరో సినిమా ప్రకటించాడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఐతే జై హనుమాన్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని టాక్. ఐతే ఈ సినిమాలో హనుమంతుడిగా చిరంజీవిని (Chiranjeevi) తీసుకోవాలని ప్రశాంత్ వర్మ ప్రయత్నిస్తున్నాడట. హనుమాన్ వీర భక్తుడైన చిరంజీవి ఆ ఆఫర్ తనకిస్తే కాదనలేడు.

అంతేకాదు అలాంటి పాత్రల్లో చేయడం చిరంజీవికి కూడా ఇష్టమే. అందుకే ప్రశాంత్ వర్మ చిరుతోనే హనుమాన్ రోల్ చేయించాలని పట్టుబడుతున్నాడట. చిరు డేట్స్ ఇస్తే చాలు ఎప్పుడైనా షూటింగ్ పెట్టుకుంటా అనేలా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. కచ్చితంగా చిరు ఉంటే మాత్రం జై హనుమాన్ కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి వశిష్త డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా విజువల్ వండర్ గా క్రియేట్ చేయబోతున్నారని అంటున్నారు. చిరు విశ్వంభరతో పాటుగా జై హనుమాన్ కూడా చేస్తే మాత్రం ఒక రేంజ్ పాపులారిటీ వచ్చేస్తుందని చెప్పొచ్చు. విశ్వంభర తో పాటు జై హనుమాన్ కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్రాజెక్ట్ కాబట్టి చిరు ఓకే చేస్తే మాత్రం అటు సినిమాకు సూపర్ బూస్ట్ ఇవ్వడంతో పాటు మెగా ఫ్యాన్స్ కోరిక కూడా తీరుతుంది.

Also Read : Sudher Babu : అక్కడ ఫ్లాప్ ఇక్కడ హిట్..!