Chiru Comments: చిరు హాట్ కామెంట్స్…ఆ డైరెక్టర్ ను ఉద్ధేశించేనా ?

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరక్టర్లకు చురకులు... అదే సమయంలో సలహాలు ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ హాట్ కామెంట్స్ కు వేదికైంది.

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 12:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరక్టర్లకు చురకులు… అదే సమయంలో సలహాలు ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ హాట్ కామెంట్స్ కు వేదికైంది. ముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో వుందనీ, థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదని అనుకోవడం సరికాదన్నారు. సరైన కంటెంట్ ఇవ్వగలిగితే తప్పకుండా ప్రజలు థియేటర్స్ కు వస్తారన్నారు. బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 మంచి కంటెంట్ తో వచ్చాయి హిట్ అయ్యాయని గుర్తు చేశారు. ఇండస్ట్రీ కి వచ్చే వాళ్ళు ప్రేక్షకులకు ఎది అవసరం అనేది చూసి కథల మీద దృష్టి పెట్టాలని దర్శకులకు సూచించాడు. అయితే చిరు చేసిన మరికొన్ని కామెంట్స్ ఆచార్య మూవీ డైరెక్టర్ కొరటాల శివను ఉద్ధేశించి చేసినవేనని భావిస్తున్నారు. కథలో కంటెంట్ లేకుంటే మూవీ ఫ్లాప్ అవుతుందని, దీనికి తాను కూడా బాధితుడునే అని చెప్పుకొచ్చారు. ఇటీవలే తన సినిమా కంటెంట్ లేక సరిగ్గా ఆడలేదని చిరంజీవి వ్యాఖ్యానించారు. డేట్స్ క్లాష్ అవుతున్నాయని, కంగారు కంగారుగా గా షూటింగ్స్ చెయ్యొద్దన్నారు.

డైరెక్టర్ అనే వాడు కథల మీద దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది పరిశ్రమ అపోహ మాత్రమేనన్నారు చిరు. మంచి కంటెంట్ వస్తే ఆస్వాదించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారనీ, దర్శకులు సినిమా విడుదలపై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రేక్షకులకు ఏది అవసరమో వాటిపైనే దర్శకులు దృష్టి సారించాలన్నారు. రీసెంట్ గా విడుదలైన చిరంజీవి సినిమా ఆచార్య భారీ అంచనాల మధ్య వచ్చి పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే దర్శకుడు కొరటాల శివ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారన్న అభిప్రాయం వినిపించింది. చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పలువురు సీనియర్ నటీనటులతో తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్ కు కథలో కంటెంట్ లేకపోవడమేనని ఇప్పుడు చిరు చెప్పడం చర్చనీయాంశమైంది.