Site icon HashtagU Telugu

Anu Dating Allu Sirish? ఆ యంగ్ హీరోయిన్ తో మెగా హీరో డేటింగ్!

Urvashi

Urvashi

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ‘ఊర్వశవి రక్షశివో’తో  అనే సినిమా కోసం జతకట్టారు. ఈ చిత్రంలో రెండు కిస్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. వీరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఈ యువ జంట స్క్రీన్‌పై సరైన కెమిస్ట్రీ కుదిరిందని బయట కూడా టాక్ నడుస్తోంది. అను, శిరీష్ డేటింగ్ చేస్తున్నారని, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే నటి మాత్రం దీన్ని ఖండించింది. ఆమె చాలా తెలివైనది. మూవీ ప్రమోషన్ కోసమే డేటింగ్ పుకార్లు తెరపైకి తెచ్చారేమోనని సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీర్ ఏమాత్రం సజావుగా సాగడం లేదు. అల్లు శిరీష్‌తో ‘ఊర్వశవి రక్షశివో’తో పాటు రవితేజ ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తోంది అను.