ఐశ్వర్య రాయ్ మళ్లీ గర్భవతి అయ్యారా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు లేదా వారసురాలు రానున్నారా? అంటే అవుననే సమాధానమే సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఈ దిశగా సంకేతాలు ఇచ్చే ఒక ఘటన ఇటీవల చోటుచేసుకుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చేప్పుడు.. ఫొటో గ్రాఫర్లు వారి ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఐశ్వర్య తన చేతిని పొట్ట భాగానికి అడ్డుగా పెట్టుకుని ముందుకు నడిచారు. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు.పూర్తి స్పష్టత రావాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఐశ్వర్య రాయ్ వదులు డ్రెస్ వేసుకుని తన కూతురు ఆరాధ్య చేయి పట్టుకుని ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చారు. అభిషేక్ బచ్చన్ ఆమె వెనకాల ఉన్నారు. తల్లీకూతుళ్ల మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్న ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఐశ్వర్య రాయ్ ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. కేన్స్ 2022 అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె మీడియా కెమెరాలకు చిక్కారు. అప్పుడు కూడా ఐశ్వర్య తన పొట్ట కనిపించకుండా కవర్ చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ఫ్యామిలీకే ఎక్కువ సమయం..
2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య, అభిషేక్‌ల వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘గురు’ సినిమా సమయంలోనే అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఐష్. ఆ తర్వాత అడపాదడపా సినిమాలను చేస్తూనే ఉన్నా.. ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించారు. 2018లో విడుదలైన ‘ఫన్నీ ఖాన్’ సినిమాలో ఐశ్వర్య నటించారు. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్-1లో ఐష్ ‘నటించారు. ఆమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది.