Site icon HashtagU Telugu

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ ఈవెంట్ కు ప్లాన్!

Radheshyam

Radheshyam

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు ప్రభాస్. ఇంకా చెప్పాలంటే ‘బాహుబలి’ క్రియేట్ చేసిన వండర్స్ తో ఒక్క సినిమాకి వంద కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి చేరుకున్నారాయన. ‘బాహుబలి’ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నారు ప్రభాస్. కథల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు. అందుకే స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకువెళుతున్నారు ప్రభాస్. ‘సాహో’ తర్వాత ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘రాధేశ్యామ్’. దీన్ని సంక్రాంతి పండుగకు తీసుకురావాలనుకున్నారు. కాకపోతే… కరోనా పరిస్థితుల నేపధ్యంలో… ‘రాధేశ్యామ్’ ను పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులకోసం మేకర్స్ మరోసారి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం…

సినిమా రిలీజ్ కు కరోనా థర్డ్ వేవ్ దెబ్బేయడంతో…. జనవరి 14న రిలీజ్ కావాల్సిన ‘రాధేశ్యామ్’ వాయిదా పడింది. దీంతో సమ్మర్ లో అంటే.. ఏప్రిల్ నెలలో ‘రాధేశ్యామ్’ ను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలానే.. ప్రభాస్ అభిమానులకు మరోసారి గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించి సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా తాజాగా ఒక వార్త షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాంచి రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలు ఆకాశాన్నంటిన టైమ్ లో సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో.. మళ్లీ ప్రభాస్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అదే రెట్టింపు ఉత్సాహం తీసుకువచ్చేందుకు సినిమా నిర్మాతలు మళ్ళీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్త తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు.

ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే తో పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందించారు. గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాలా ఏళ్ళ తర్వాత తనయుడు ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కృష్ణంరాజు.