Site icon HashtagU Telugu

Ira Khan: ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడిన స్టార్ హీరో కుమార్తె.. త్వరలోనే పెళ్లి?

Ira Khan

Ira Khan

బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్‌ ఖాన్‌ గురించి మనందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ కుమార్తె అయిన ఐరా ఖాన్ కూడా మనందరికీ సుపరిచితమే. ఇది ఇలా ఉంటే తాజాగా ఐరా ఖాన్ తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తను ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖేరే నీ ప్రేమిస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇటీవల నుపుర్‌ విదేశాలకు సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లగా ఐరా కూడా వెళ్లింది. అనంతరం పోటి ముగిసిన తరువాత ఐరా దగ్గరికి వచ్చిన నుపుర్‌ ఆమెను హత్తుకుని ముద్దాడి అనంతరం నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఉంగరంతో ప్రపోజ్ చేశాడట.

దానికి ఐరా స్పందిస్తూ ఎస్ అంటూ నవ్వులు చిందించగా వెంటనే నుపుర్‌ ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగి వారి బంధాన్ని అధికారికంగా వెల్లడించారు ఈ జంట. కాగా ఇందుకు సంబంధించిన వీడియోని తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ..నేను ఎస్ చెప్పాను అని ఆమె రాసుకుంది. కాగా ఆ వీడియోని చూసిన పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ పనిచేస్తుండగా, ఐరా కూడా నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటూ.. క్రమంగా వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. అలా వారి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి మధ్య ఏదో ఉంది అంటూ వినిపిస్తున్న కూడా ఆ విషయంపై ఆ జంట స్పందించలేదు. తాజాగా వారి ప్రేమ విషయాన్ని అధికారంగా ప్రకటించింది ఐరా ఖాన్.