RRR : ఐపీఎల్‌లో నాటు నాటు మ్యానియా.. రాజస్థాన్ రాయల్స్ టీం డాన్స్ వీడియో వైరల్..

ఐపీఎల్‌లో నాటు నాటు మ్యానియా. రాజస్థాన్ రాయల్స్ టీం నాటు నాటు పాటకి డాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Ipl Rajasthan Royals Team Dance To Rrr Naatu Naatu Song Video Gone Viral

Ipl Rajasthan Royals Team Dance To Rrr Naatu Naatu Song Video Gone Viral

RRR : రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎం ఎం కీరవాణి అందించిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకి చంద్రబోస్ అచ్చతెలుగు పదాలతో లిరిక్స్ ని అందించగా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అదిరిపోయే డాన్స్ కోరియోగ్రఫీ చేసి చరణ్ అండ్ ఎన్టీఆర్ మ్యాజిక్ క్రియేట్ చేసారు.

‘నాటు నాటు’ సాంగ్ కి ఎన్టీఆర్ అండ్ చరణ్ కలిసి వేసిన హుక్ స్టెప్ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతిఒక్కరు ఆ స్టెప్ కి కాలు కదిపేలా చేసింది. మన దేశ నేతల నుంచి ఇతర దేశాల నేతలు, ప్రముఖులు సైతం ఈ స్టెప్ వేసేలా చేసింది. సినిమా వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యిపోయింది. కానీ ఇప్పటికి నాటు నాటు మ్యానియా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది.

తాజాగా ఐపీఎల్ లో ఈ నాటు నాటు మ్యానియా కనిపించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గ్రౌండ్ లో తమ ఆటతో అదరగొడుతున్న ప్లేయర్స్.. ఆ తరువాత సరదాగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ టీం.. తమ డిన్నర్ టైంలో నాటు నాటు పాటకి డాన్స్ వేసి ఎంజాయ్ చేసారు. ఇక అందుకు సంబంధించిన వీడియోని తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసారు.

ఇక దానిని ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్ రీ ట్వీట్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మరోసారి నెట్టింట నాటు నాటు ట్రెండ్ అవుతుంది. మరి ఈ ఐపీఎల్ అయ్యేలోపు ఇంకెన్ని టీమ్స్ ఈ నాటు నాటుకి స్టెప్ వేస్తారో చూడాలి.

Also read : Prabhas : తెలంగాణలో జరిగిన ఆ యుద్ధంతో ప్రభాస్, హను రాఘవపూడి సినిమా..

  Last Updated: 08 Apr 2024, 12:27 PM IST