Site icon HashtagU Telugu

Film Awards 2024: సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాస్ నేదునూరి

Film Awards 2024

Film Awards 2024

Film Awards 2024: తొలి చిత్రం సంధ్యారాగంతోనే హార్ట్ టచింగ్ ఫ్యామిలీ మూవీతో అందరినీ ఆలోచింపజేసిన దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి ఉత్తమ దర్శకుడిగా , ఈ చిత్ర హీరో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో సుహాస్ సిస్టు, కావ్య శ్రీ జంటగా తెరకెక్కిన హార్ట్ టచింగ్ ఫ్యామిలీ మూవీ సంధ్యారాగం.ఈ మూవీ ఇప్పుడు రెండు అవార్డులు సొంతం చేసుకుంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024, ఐయఫ్ఎంఎ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాస్ నేదునూరి,ఉత్తమ నటుడుగా సుహస్ సిస్టు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 4 న తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ వేడుకలో ఈ అవార్డ్స్ బహూకరించడం జరిగింది.అవార్డ్ అందుకున్న సుహాస్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని,ఎంపిక చేసిన జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు.దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి మాట్లాడుతూ.. కంటెంట్ ప్రధానంగా చేసుకుని తెరకెక్కించిన సంధ్యారాగం చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. ప్రోత్సహించిన ఐఎఫ్ఎమ్ఎ వారికి, జ్యూరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా నిర్మాణంలో వెన్నుదన్నుగా నిలిచిన అడ్వకేట్ సిస్టు రమేష్ గారికి,రమేష్ పైల(యుఎస్)గారికి, డిజిపోస్ట్ స్టూడియోకి, చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ జియల్ బాబు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారికి,ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రతీ ఒక్క టెక్నిషియన్ తో పాటు, చిత్ర నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా హిందీలో ఇట్స్ మై లవ్ పేరుతో డబ్ అయి సక్సస్ ఫుల్ గా పెన్ మూవీస్ లో స్ట్రీమింగ్ అవుతోందని,త్వరలో తమిళ, కన్నడ,బెంగాలీ, ఒరియా భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాస్ నేదునూరి తెలిపారు.

రెండో సినిమాకు సన్నాహాలు

శ్రీనివాస్ నేదునూరి దర్శకత్వంలో త్వరలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉందని,ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని డైరెక్టర్ శ్రీనివాస్ నేదునూరి తెలిపారు.

Also Read: Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ

Exit mobile version