Site icon HashtagU Telugu

Vishwambhara : ‘విశ్వంభర’ నుంచి ఆసక్తికర అప్డేట్

Vishwambhara Highlight Scen

Vishwambhara Highlight Scen

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara ) షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ‘బింబిసార’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి అనేక విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇప్పటికే లీకైన పోస్టర్లు, టీజర్ల ద్వారా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Waqf Act : వక్ఫ్‌ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత విక్రమ్ కె.కేన్స్‌ ఆసక్తికర సమాచారం పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పోస్ట్ ప్రొడక్షన్ మరియు VFX పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. ఇదే స్పీడ్ కొనసాగితే త్వరలోనే సినిమా మొత్తం పూర్తయ్యే అవకాశముంది. టెక్నికల్ పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్రపంచ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. ఆ ప్రకటన అనంతరం విశ్వంభరపై భారీ ప్రమోషన్స్ ఉండనున్నాయని స్పష్టం చేశారు. చిరంజీవి సినిమాగా ఉండటంతో పాటు మైథలాజికల్ టచ్ ఉన్న కథ, విజువల్ గ్రాండియర్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయని భావిస్తున్నారు. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.