Site icon HashtagU Telugu

Bigg Boss Season 6: వామ్మో ఇదేంటి.. ప్రేమతో అర్జున్ కి గోరుముద్దలు తినిపించిన శ్రీ సత్య?

Bigg Boss Season 6

Bigg Boss Season 6

తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ వారం కెప్టెన్సీ పోటీ కోసం కంటెంటర్లను ఎంపిక చేయడం కోసం బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ని ఇచ్చాడు. హోటల్ వర్సెస్ హోటల్ అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఇంట్లో సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేసే రెండు హోటలను ఏర్పాటు చేశారు. కొంతమందిని కస్టమర్లు గా పెట్టి ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయాలి అన్న టాస్క్ ని ఇచ్చారు. ఇక అవతలి కంటెస్టెంట్లను ఇంప్రెస్ చేయడం కోసం ఇతర కంటెస్టెంట్లు నానా తిప్పలు పడ్డట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్ అని ఇంప్రెస్ చేయడం కోసం సార్ సార్ అంటూ వారిని బ్రతిమలాడుతున్నారు.

అయితే కస్టమర్లను సంతృప్తి పరిస్థితినే హోటల్ లో పని చేసిన వారికి డబ్బులు వస్తాయి. ఈ హోటల్ కి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ టీం విన్ అవుతుంది. సూర్యా, అర్జున్‌ కల్యాణ్‌, రాజ్‌ గెస్టులుగా వ్యవహరించగా,వారికి సేవలు చేసి మంచి మార్కులు, డబ్బులు సంపాదించేందుకు శ్రీ సత్య, వాసంతి, ఆరోహీ, కీర్తీ వంటి వారంతా తెగ ప్రయత్నాలు చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ టాస్క్ అర్జున్ కు బాగానే కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. అర్జున్ ఆమెను ఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.

కానీ శ్రీ సత్య మాత్రం అర్జున్ ని అన్నా అని పిలవడం అసలు పట్టించుకోవడం లాంటివి చేస్తూ ఉంది. ఈ టాస్కు లో భాగంగా శ్రీ సత్య అర్జున్‌ కల్యాణ్‌కు బంపర్ ఆఫర్‌ ఇస్తూ ఆమ్లెట్‌ వేసేందుకు రూ.1000 అడగ్గా అందుకు అర్జున్‌ చాలా ఎక్కువ అని ఫీలవుతాడు. అందుకు శ్రీ సత్య ఫుడ్‌ కూడా తినిపిస్తాను అంటూ ఆఫర్‌ ఇచ్చింది. అందుకు అర్జున్‌ కల్యాణ్‌ ఒకే అని చెప్పాడు. శ్రీ సత్య చెప్పిన విధంగానే అన్నం కలిపి అర్జున్‌ కల్యాణ్‌కు గోరు ముద్దలు తినిపించింది.

Exit mobile version