Ram Charan: ఆసక్తి రేపుతున్న RC16, బాడీ బిల్డర్‌ పాత్రలో రామ్ చరణ్?

(Ram Charan) చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Rc16

Rc16

శంకర్ గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ (Ram Charan) చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే అంచనాలు రేపుతోంది. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపుర్ నటిస్తుంది? అనే వార్త హల్ చల్ చేయగా, తాజాగా బాడీ బిల్డర్‌ (Biography) కోడి రామ్మూర్తి నాయుడు లైఫ్ హిస్టరీ ఆధారంగా తీస్తారని మరో టాక్ వినిపిస్తోంది.

విశాఖ జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇండియాకు స్వతంత్రం రాకముందే చనిపోయిన ఈ అన్‌సంగ్‌ హీరో.. ఇండియాలోనే (India) ఫేమస్‌ బాడీ బిల్డర్‌. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా రైలు ఇంజన్‌ను ఆపిన రికార్డ్‌ ఆయన సొంతం. చెస్ట్‌ మీద ఏనుగును నిలబెట్టుకునేవాడు, మీసాలతో వెహికిల్స్‌ను లాగేవాడు. కుస్తీ పోటీల్లో, మల్ల యుద్ధాల్లో అప్పట్లో ఆయనను బీట్‌ చేసేవాళ్లు లేరు.

అప్పట్లో కింగ్‌ జార్జ్‌ ఫైవ్‌ నుంచి ఇండియన్‌ హెర్యులస్‌ అనే బిరుదును కూడా ఆయన పొందారు. అయితే పూర్తిగా రామ్మూర్తి నాయుడు బయోపిక్‌లా కాకుండా ఆయన జీవితంలోని ఇంపార్టెంట్‌ లైన్స్‌ మాత్రమే లీడ్‌గా తీసుకుని బుచ్చిబాబు (Buchi Babu) కథ సిద్ధం చేశారని టాక్‌. అంతే కాదు ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ డుయల్‌ రోల్‌ చేయబోతున్నాడట. ఇవన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఎలాంటి బయో పిక్ లో నటించడం లేదని ఆ మూవీ టీం చెబుతోంది.

Also Read: Sai Pallavi Lip Lock: ఆ హీరోకే సాయిపల్లవి ఫస్ట్ లిప్ కిస్.. వీడియో ఇదిగో!

  Last Updated: 27 Apr 2023, 03:52 PM IST