Nagarjuna@BiggBoss: ఇతరుల జీవితాల్లోకి చొచ్చుకెళ్లి..నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nagarjuna

Nagarjuna

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఆయన తాజాగా ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్-6’కు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో నిర్వహించడం సంతోషంగా ఉందని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బిగ్‌బాస్ మొదటి సీజన్ నిర్వహణ తనకు చాలా ఇబ్బంది అనిపించిందన్నారు. ఇతరుల జీవితాల్లోకి చొచ్చుకెళ్లి జడ్జిగా తీర్పు ఇస్తున్నట్లు అనిపించిందని చెప్పారు. కానీ, ఫన్ గా హోస్ట్ చేయడం నేర్చుకున్నట్లు తెలిపారు.
హిందీలో అగ్రనటుల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ మాదిరిగా హోస్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఆయన అద్భుతంగా హోస్ట్ చేస్తారని చెప్పారు.

తనకు ఎంటర్ టైన్‌మెంట్ గురించి తెలుసని, బిగ్‌బాస్ హౌస్‌లో అద్భుతంగా కామెడీ పండుతోందని వివరించారు. పాల్గొనేవారికి కామెడీ గేమ్స్‌నే ఇస్తామని చెప్పారు. సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తాను షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నప్పటి నుంచి ఆయనను కలుసుకోలేదని చెప్పారు. ఆయన కొన్నేళ్లుగా బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని, తాను మాత్రం మూడేళ్ల క్రితమే హోస్ట్ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. తాను దేశంలోని అన్ని వెర్షన్స్ బిగ్‌బాస్ చూస్తుంటానని చెప్పారు. హిందీ వెర్షన్ ఈ మధ్యనే చూశానని, కమల్ హాసన్, మోహన్ లాల్‌లవి కూడా చూసినట్లు తెలిపారు. అన్ని కార్యక్రమాల నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకుంటానని, ఎలా హోస్ట్ చేస్తున్నారో గమనిస్తుంటానని నాగార్జున చెప్పారు.

  Last Updated: 18 Sep 2022, 11:27 PM IST